User loginPollActive forum topicsWho's online
There are currently 0 users and 1 guest online.
Who's new
|
ఓబుళాపురం-కృష్ణపట్నం రైల్వే లైన్‌కు వెయ్యి ఎకరాల భూసేకరణకడపజిల్లా ఓబుళాపురం నుండి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు వెయ్యి ఎకరాలలో రైల్వేలైను నిర్మాణం కోసం భూసేకరణ మార్చి 1నుండి సర్వే నిర్వహించనున్నట్లు మనుబోలు మండల తహసీల్దార్ ఎంవి కృష్ణమూర్తి వెల్లడించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన స్థానిక విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రైల్వేలైను కోసం మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీ పరిధిలో సర్వేనంబరు 1079, 1097, 1098,1094, 1099,1135,1137, 1138, 1111, 1112లలో 33.24ఎకరాలలో భూమిని సేకరించనున్నట్లు తహసీల్దార్ వివరించారు. నాలుగు సర్వేనంబర్లలో ప్రభుత్వభూమి ఉండగా ఎనిమిది సర్వే నంబర్లలో ప్రైవేటు భూములు ఉన్నాయని, వీటిని సబ్‌డివిజన్ చేయించి బాధితులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 13.50 కోట్ల రూపాయలతో ఈ పనులను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈరైల్వే మార్గానికి రాపూరు, పొదలకూరు, సైదాపురం, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో దాదాపుగా వెయ్యి ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.
|
New forum topicsPopular contentToday's:
All time: |
Recent comments
1 year 25 weeks ago
1 year 33 weeks ago
1 year 37 weeks ago
1 year 42 weeks ago
2 years 2 weeks ago
2 years 3 weeks ago