స్వర్ణముఖి పొర్లుకట్టల మరమ్మతులకు రూ 200 కోట్లు

కోట, ఏప్రిల్ 5: స్వర్ణముఖి నది పొర్లుకట్టల మరమ్మతులకు 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఇ గణపతిరావు తెలిపారు. కోట మండలం గూడలి సమీపంలో స్వర్ణముఖి పొర్లుకట్టలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నాయుడుపేట వద్ద నుంచి పామంజి వరకు స్వర్ణముఖి నది పొర్లుకట్టల మరమ్మతులకు ఐదు ప్యాకేజిలుగా 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో భాగంగా ఒకదానికి మాత్రమే టెండర్లు జరిగినట్లు తెలిపారు. అలాగే గూడలి వద్ద నుంచి కొత్తపట్నం వరకు వున్న చల్లకాల్వ పొర్లుకట్టల మరమ్మతులకు రెండు ప్యాకేజిల కింద 63 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఒక దానికి మాత్రమే టెండర్ జరిగిందని, మిగిలిన దానికి త్వరలోనే టెండర్ పిలిచి పనులను ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ఆశాఖ ఇఇ వెంకటేశ్వరరావు, డిఇ గణేష్‌కుమార్, ఎఇ నాగరాజు తదితరులు వున్నారు.

http://www.andhrabhoomi.net/sri-pottisriramulu/funds-331