సింహపురికి రోశయ్య వరాలు

నెల్లూరు నగరంలో 450 కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు. నగరంలోని విఆర్‌సి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం నెల్లూరు నగరానికి సరిపడా నీటిని అందిస్తున్నప్పటికీ రాబోయే దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 158 కోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి వ్యవస్థను అభివృద్ధి పరచనున్నట్లు వివరించారు. దీనిలో భాగంగానే నెల్లూరు చెరువును అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టు వరకూ నాలుగు రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు ఆయన చెప్పారు

http://www.suryaa.com/main/showDistricts.asp?subCat=15&ContentId=81595